ఎల్‌ఆర్‌ఎస్‌ లేకున్నా రిజిస్ట్రేషన్లు చేయాలి

ABN , First Publish Date - 2020-09-05T09:26:49+05:30 IST

ఎల్‌ఆర్‌ఎస్‌ లేకున్నా రిజిస్ట్రేషన్లు చేయాలి

ఎల్‌ఆర్‌ఎస్‌ లేకున్నా రిజిస్ట్రేషన్లు చేయాలి

  • తెలంగాణ రియల్టర్స్‌ అసోసియేషన్‌

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ఎస్‌ లేకున్నా భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించాలని తెలంగాణ రియల్టర్స్‌ అసోసియేషన్‌, ప్లాట్ల యజమానులు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ పేరిట తీసుకువచ్చిన జీవో నం.131 దుర్మార్గంగా ఉందని, పేద, మధ్య తరగతి ప్రజలు భరించలేని పరిస్థితుల్లో ఉన్నారని విమర్శించారు. శుక్రవారం ఫీర్జాదిగూడ మునిసిపాలిటీలో పరిధిలోని సాయి ప్రియానగర్‌ కాలనీలో వారు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్షులు నారగోని ప్రవీణ్‌ ప్రధాన కార్యదర్శి ఎం.కరుణాకర్‌ మాట్లాడారు. కరోనాతో ప్రజలంతా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో  బలవంతంగా ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని ప్రజలపై రుద్దడం సరైన నిర్ణయం కాదన్నారు.   

Updated Date - 2020-09-05T09:26:49+05:30 IST