ప్రియుడి ఇంటి ముందు బైటాయించిన యువతి

ABN , First Publish Date - 2020-07-10T17:16:34+05:30 IST

ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట బైటాయించింది. ఈ ఘటన హుజూరాబాద్ మండలంలోని ఎడవల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎడవల్లి గ్రామానికి చెందిన చెందిన నాగుల

ప్రియుడి ఇంటి ముందు బైటాయించిన యువతి

కరీంనగర్: ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి తన ప్రియుడి ఇంటి ఎదుట బైటాయించింది. ఈ ఘటన హుజూరాబాద్ మండలంలోని ఎడవల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎడవల్లి గ్రామానికి చెందిన నాగుల చంద్రశేఖర్, పెద్దపల్లి జిల్లాలోని జూలపల్లి మండలానికి చెందిన బాధిత యువతి ప్రేమించుకున్నారు. అయితే ఇప్పుడు తనను కాదని మరో పెళ్లికి సిద్ధమయ్యాడని, ప్రేమించి మోసం చేశాడని బాధిత యువతి ఆరోపిస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Updated Date - 2020-07-10T17:16:34+05:30 IST