‘విద్యుత్తు’ సవరణబిల్లుతో రైతులకు నష్టమే: మంత్రి
ABN , First Publish Date - 2020-05-09T09:43:46+05:30 IST
కేంద్ర విద్యుత్తు సవరణ బిల్లు- 2020 రైతులకు, సామాన్య ప్రజలకు శాపంగా మారనుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నిర్మల్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉచిత కరెంట్‌కు కోత పెట్టేలా
నిర్మల్/హైదరాబాద్, మే 8(ఆంధ్రజ్యోతి): కేంద్ర విద్యుత్తు సవరణ బిల్లు- 2020 రైతులకు, సామాన్య ప్రజలకు శాపంగా మారనుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నిర్మల్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉచిత కరెంట్‌కు కోత పెట్టేలా కేంద్రం తీరు బాధాకరమన్నారు. విద్యుత్తు రంగ సంస్థలను ప్రైవేటీకరించాలనే కుట్రలో భాగంగా కేంద్రం సవరణ చట్టాన్ని తేనుందని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు.