ఓఆర్ఆర్ వద్ద మిర్చి లోడ్‌తో వచ్చిన లారీ మాయం
ABN , First Publish Date - 2020-04-28T16:58:08+05:30 IST
సంగారెడ్డి: పటాన్ చెరు మండలం ముత్తంగి ఔటర్ రింగ్ దగ్గర మిర్చి లోడ్‌తో వచ్చిన లారీ మాయమైంది.

సంగారెడ్డి: పటాన్ చెరు మండలం ముత్తంగి ఔటర్ రింగ్ దగ్గర మిర్చి లోడ్‌తో వచ్చిన లారీ మాయమైంది. నేటి తెల్లవారుజామున గుంటూరు నుంచి మిర్చీ లోడ్‌తో ఓ లారీ వచ్చింది. దానిని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుపోయి మెదక్ జిల్లా తూప్రాన్ దగ్గర వదిలేసి పారిపోయారు. మిర్చి లోడ్‌తో లారీ రావడంతో లక్షల్లో డబ్బులుండొచ్చని దొంగలు భావించినట్టు తెలుస్తోంది. అయితే లారీని ఎత్తుకెళ్లింది డ్రైవరా...? దొంగలా..? అనేది తెలియాల్సి ఉంది. లారీ డ్రైవర్ కనిపించకుండా పోవడంతో అతని పైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తూప్రాన్‌లో లారీ దొరకడంతో అక్కడికి వెళ్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో జిల్లాలో ఇదే పెద్ద చోరీ కావడంతో పోలీసులు దీనిని సవాల్‌గా తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు.