డ్రైవింగ్ చేస్తూ మత్తులోకి డ్రైవర్..లేచి చూస్తే షాక్...
ABN , First Publish Date - 2020-09-14T19:50:25+05:30 IST
ఇందల్వాయి టోల్ గేట్ దగ్గర ఓ లారీ బీభత్సం సృష్టించింది.
నిజామాబాద్ జిల్లా: ఇందల్వాయి టోల్ గేట్ దగ్గర ఓ లారీ బీభత్సం సృష్టించింది. టోల్ ప్లాజా దగ్గర వాహనాలపైకి దూసుకెళ్లి.. డివైడర్‌ను ఢీ కొట్టి ఆగిపోయింది. ఇద్దరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనలో మూడు కార్లు దెబ్బతిన్నాయి. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.