మార్చి 31 వరకూ లోకాయుక్తలో విచారణలు ఉండవు
ABN , First Publish Date - 2020-03-23T22:58:09+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం ఈనెల 31వ తేదీ వరకూ తెలంగాణ లాక్‌డౌన్ ప్రకటించిన నేపధ్యంలో లోకాయుక్తలోనూ విచారణలకు

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం ఈనెల 31వ తేదీ వరకూ తెలంగాణ లాక్‌డౌన్ ప్రకటించిన నేపధ్యంలో లోకాయుక్తలోనూ విచారణలకు ఫుల్‌స్టాప్‌పెట్టారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు లోకాయుక్తలో 31వ తేదీ వరకూ విచారణలు ఉండవని ఒక ప్రకటనలో తెలిసింది. కేసులకు సంబంధించి ఎవరూ కార్యాలయానికి రావద్దని పేర్కొంది. అధికారులు, సిబ్బంది కూడా కార్యాలయాలకు రాకుండా ఇంటి వద్దనే ఉండాలని తెలిపింది. విచారణలకు సంబంధించి తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తామని అన్నారు.