రైలు ఢీకొని లోకో పైలట్‌ దుర్మరణం

ABN , First Publish Date - 2020-07-28T07:10:39+05:30 IST

తెలంగాణకు చెందిన ఓ లోకో పైలట్‌ రైలు ఢీకొని దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చత్తీ్‌సఘడ్‌లో జరిగింది. ఉమ్మడి

రైలు ఢీకొని లోకో పైలట్‌ దుర్మరణం

వికారాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు చెందిన ఓ లోకో పైలట్‌ రైలు ఢీకొని దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చత్తీ్‌సఘడ్‌లో జరిగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి వద్ద పీఆర్‌వోగా పనిచేస్తున్న మల్లారెడ్డి కుమారుడు ప్రకాశ్‌రెడ్డి (24) చత్తీ్‌సగఢ్‌లో రైల్వేలో లోకో పైలట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి విధులు పూర్తి చేసుకున్న ప్రకా్‌షరెడ్డి.. రాస్మారా రైల్వే స్టేషన్‌లో రైలు దిగాడు. ఇంటికి వెళ్లే క్రమంలో పట్టాలు దాటుతుండగా.. అదే సమయంలో వచ్చిన రైలు అతడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ప్రకా్‌షరెడ్డిని రైల్వే ఉద్యోగులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

Updated Date - 2020-07-28T07:10:39+05:30 IST