లాక్ డౌన్ పాటించని షాపులకు భారీ జరిమానా

ABN , First Publish Date - 2020-05-10T00:58:13+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది

లాక్ డౌన్ పాటించని షాపులకు భారీ జరిమానా

యాదాద్రి: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భువనగిరి పట్టణంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన షాపులకు భారీ జరిమానా విధించారు. అందులో ఏడు షాపులకు మున్సిపల్ అధికారులు రూ. 35 వేల జరిమానా విధించి వసూలు చేశారు.

Updated Date - 2020-05-10T00:58:13+05:30 IST