ప్రాణం తీసిన లాక్‌డౌన్‌.. గుండె పోటుతో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-04-25T08:37:25+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా సకాలంలో వైద్యం అందక మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం బండబోసన్‌పల్లికి చెందిన తాళ్లపల్లి శ్రీనివాస్‌(48) గుండెపోటుతో ..

ప్రాణం తీసిన లాక్‌డౌన్‌.. గుండె పోటుతో వ్యక్తి మృతి

మెదక్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 24: లాక్‌డౌన్‌ కారణంగా   సకాలంలో  వైద్యం అందక మెదక్‌ జిల్లా  వెల్దుర్తి మండలం బండబోసన్‌పల్లికి చెందిన తాళ్లపల్లి శ్రీనివాస్‌(48) గుండెపోటుతో మృతిచెందారు. ఆయన 4 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు గురువారం మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ రక్తపరీక్షలు నిర్వహించి మరుసటిరోజు రమ్మని చెప్పడంతో శుక్రవారం ఉదయం వెళ్లగా గుండె ఎక్స్‌రే తీయాలని చెప్పారు. మధ్యాహ్నం వరకు డాక్టర్లు చూడకపోవడంతో ఇంటికి తీసుకెళ్లారు. ఇంటివద్ద శ్రీనివాస్‌ కుప్పకూలడంతో మళ్లీ ఆస్పత్రికి తరలించారు. ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  

Updated Date - 2020-04-25T08:37:25+05:30 IST