రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ పొడిగింపు

ABN , First Publish Date - 2020-08-01T07:39:40+05:30 IST

రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ పొడిగింపు

రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ పొడిగింపు

హైదరాబాద్: కొవిడ్‌ నియంత్రణలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు పొడిగించింది. కేంద్ర హోంశాఖ ఇటీవల విడుదల చేసిన అంశాలనే రాష్ట్రం తాజా లాక్‌డౌన్‌లో ప్రస్తావించింది. ఈ మేరకు.. స్కూళ్లు, కళాశాలలు, విద్యాసంస్థలు, కోచింగ్‌ కేంద్రాలపై నిషేధం కొనసాగనుంది. సినిమా థియేటర్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, పార్కులు, బార్లు, ఆడిటోరియాలు, సమావేశ మందిరాలను తెరవకూడదు. సామాజిక, రాజకీయ, క్రీడలు, వినోదం, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలు, మెట్రోరైళ్లపై నిషేధం కొనసాగుతుంది. ఇప్పటి వరకు కొనసాగిన రాత్రి కర్ఫ్యూను ఎత్తివేసింది. అంతర్‌ రాష్ట్ర ప్రయాణాలపై నిషేధాజ్ఞలు ఉండవు. యోగా కేంద్రాలు, వ్యాయామ శాలలను ఆగస్టు 5 నుంచి తెరవొచ్చు. కంటైన్‌మెంట్‌ జోన్లలో నిషేధాజ్ఞలు యథావిధిగా కొనసాగుతాయి. కాగా.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మరిన్ని కంటైన్‌మెంట్‌ జోన్లను ప్రకటించారు.

Updated Date - 2020-08-01T07:39:40+05:30 IST