తెలంగాణలో మే 31 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు: సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2020-05-19T01:42:15+05:30 IST

తెలంగాణలో మే 31 వరకూ లాక్‌డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేబినెట్ భేటీ అనంతరం...

తెలంగాణలో మే 31 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు: సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణలో మే 31 వరకూ లాక్‌డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. కట్టడి ప్రాంతాలు మినహా అన్ని జోన్లను గ్రీన్‌జోన్లుగా ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. కట్టడి ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసరాలను ప్రభుత్వమే అందిస్తుందని తెలిపారు. 1,452 కుటుంబాలకు కట్టడి ప్రాంతాల్లో ఉన్నాయని, కట్టడి ప్రాంతాల్లోని ప్రజలంతా సహకరించాలని కేసీఆర్‌ కోరారు. కరోనాకు వ్యాక్సిన్‌ ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదని, కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలని ఆయన సూచించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బతుకు కొనసాగించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Updated Date - 2020-05-19T01:42:15+05:30 IST