స్పందన ఆధ్వర్యంలో ‘అన్న వితరణ’

ABN , First Publish Date - 2020-04-05T21:32:18+05:30 IST

లాక్‌డౌన్ నేపథ్యంలో అన్నార్తులకు ‘స్పందన వెల్ఫేర్ సొసైటి’ అండగా ఉంటుంది.

స్పందన ఆధ్వర్యంలో ‘అన్న వితరణ’

హైదరాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో అన్నార్తులకు ‘స్పందన వెల్ఫేర్ సొసైటి’ అండగా నిలుస్తోంది. హైదరాబాద్, కరీంనగర్, మెట్టుపల్లి, నిజామాబాదులో పేదలకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కరీంనగర్‌లో పూటకు 300 మంది, హైదరాబాద్‌లో పూటకు 450 నుంచి 500 మంది, మెట్‌పల్లి, నిజామాబాద్‌లలో పూటకు 100 మంది చొప్పున రెండు పూటలా భోజన వసతి కల్పిస్తోంది. దాదాపు రోజుకు 2 వేలమంది భోజనాలు చేస్తున్నారన్నారు. లాక్‌డౌన్ కొనసాగినన్ని రోజులు ఇది కొనసాగుతుందన్నారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో సొసైటీ సభ్యులు దూలం కల్యాణ్, శశి గరిమెళ్ల, దేవికా రాణి తదితరులు పాల్గొన్నారు. లాక్‌డౌన్ మొదలైన దగ్గర్నుంచి తమ కార్యక్రమం జరుగుతుందన్నారు. త్వరలో వికలాంగులకు, నిరుపేద పూజారులకు నిత్యవసరాలు అందించబోతన్నట్టు తెలిపారు. 

Updated Date - 2020-04-05T21:32:18+05:30 IST