లాక్‌డౌన్ నిబంధనలను నీరుగార్చొద్దు... కేంద్రం స్పష్టీకరణ

ABN , First Publish Date - 2020-05-18T22:39:27+05:30 IST

లాక్‌డౌన్ ‘4.0’లో మరిన్ని సడలింపులను ఇచ్చిన కేంద్రం.,. మొత్తం ప్రక్రియను తూచా తప్పకుండా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది. కేంద్రం వెల్లడించిన మార్గదర్శకాలను మేరకు ఆంక్షలను సడలించాలని కేంద్ర హోం శాఖ సూచించింది. వీటిని నీరుగార్చే ప్రయత్నాలను ఏమాత్రం చేయరాదని పేర్కొంది.

లాక్‌డౌన్ నిబంధనలను నీరుగార్చొద్దు... కేంద్రం స్పష్టీకరణ

న్యూఢిల్లీ : లాక్‌డౌన్ ‘4.0’లో మరిన్ని సడలింపులను ఇచ్చిన కేంద్రం.,. మొత్తం ప్రక్రియను తూచా తప్పకుండా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది. కేంద్రం వెల్లడించిన మార్గదర్శకాలను మేరకు ఆంక్షలను సడలించాలని కేంద్ర హోం శాఖ సూచించింది. వీటిని నీరుగార్చే ప్రయత్నాలను ఏమాత్రం చేయరాదని పేర్కొంది.


కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు... రాష్ట్రాలు నిబంధనలను రూపొందించాలని స్పష్టం చేసింది. అవసరమని భావించిన పరిమితులను విధించవచ్చని, ఇతర కార్యకలాపాలను నిషేధించవచ్చని తెలిపింది. కోవిడ్-19 ని నిరోధించాల్సిన ప్రక్రియ నిర్వహణ కోసం జాతీయస్థాయి మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా అమలులో ఉంటాయని పునరుద్ఘాటించింది.


బయటకు వచ్చేటప్పుడు ప్రజలు తప్పనిసరిగా భౌతికదూరం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలను పాటించాలని, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయయడం శిక్షార్హమని ఉద్ఘాటించింది. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా ఈ మేరకు లేఖ రాశారు.Updated Date - 2020-05-18T22:39:27+05:30 IST