లాక్‌డౌన్.. సర్పంచ్ దాతృత్వం..

ABN , First Publish Date - 2020-03-28T14:51:40+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఆ సర్పంచ్ అండగా నిలబడ్డారు. కుటుంబానికి అవసరమైన ఆహార పదార్థాలను ఉచితంగా సరఫరా చేశారు. వివరాల్లోకెళితే.. కొండాపూర్ మండలం గుంతపల్లిలో

లాక్‌డౌన్.. సర్పంచ్ దాతృత్వం..

సంగారెడ్డి: లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఆ సర్పంచ్ అండగా నిలబడ్డారు. కుటుంబానికి అవసరమైన ఆహార పదార్థాలను ఉచితంగా సరఫరా చేశారు. వివరాల్లోకెళితే.. కొండాపూర్ మండలం గుంతపల్లిలో సర్పంచ్ సుమిత్ర 450 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఆమె కొడుకు అనంతరెడ్డితో కలిసి ప్రజలకు వారం రోజులకు సరిపడా కూరగాయలను పంపిణీ చేశారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని, లాక్‌డౌన్‌ను పకడ్బందీగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-03-28T14:51:40+05:30 IST