లాక్‌డౌన్ సూచనలను కేబినెట్ భేటీలో చర్చిస్తాం: కేటీఆర్

ABN , First Publish Date - 2020-05-18T17:33:35+05:30 IST

రాష్ట్రంలో లాక్‌డౌన్ మూడో దశ నడుస్తోంది. తాజాగా కేంద్రం నాలుగో దశ మార్గదర్శకాలను విడుదల చేసింది.

లాక్‌డౌన్ సూచనలను కేబినెట్ భేటీలో చర్చిస్తాం: కేటీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్ మూడో దశ నడుస్తోంది. తాజాగా కేంద్రం నాలుగో దశ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ భేటీకి సిద్ధమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు.  లాక్ డౌన్ పొడిగింపు, సడలింపులపై పెద్ద ఎత్తున సూచనలు అందాయన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు జరిగే కేబినెట్ సమావేశంలో వీటిని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. Updated Date - 2020-05-18T17:33:35+05:30 IST