అద్దెపై వేధింపులు.. యజమానులకు కౌన్సిలింగ్
ABN , First Publish Date - 2020-04-21T00:35:22+05:30 IST
లాక్‌డౌన్ వేళ ఇంటి యజమానులు అద్దెదారులను వేధించొద్దని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం నిర్వహించిన
హైదరాబాద్: లాక్‌డౌన్ వేళ ఇంటి యజమానులు అద్దెదారులను వేధించొద్దని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడారు. రూమ్ రెంట్‌ల వేధింపుల విషయంలో ఇప్పటి వరకు డయల్ 100కు 36 కాల్స్ వచ్చాయన్నారు. ఇంటి ఓనర్స్‌ను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్పారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఉపాధి కూడా లేకపోవడం ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి నగరంలో, ఇతర పట్టణాల్లో అద్దె ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మూడు నెలల పాటు అద్దెదారులెవరూ ఇంటి అద్దె చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఈ మేరకు ఇంటి యజమానులు అద్దె వసూలు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా ఇంటి అద్దె గురించి ఇబ్బంది పెడితే 100కు డయల్ చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.