జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల
ABN , First Publish Date - 2020-11-01T00:43:23+05:30 IST
జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 7న ఓటర్ జాబితా ముసాయిదా ప్రకటించనుంది. 11వ తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరించనుంది. నవంబర్ 9న రాజకీయ పార్టీల ప్రతినిధులతో

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 7న ఓటర్ జాబితా ముసాయిదా ప్రకటించనుంది. 11వ తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరించనుంది. నవంబర్ 9న రాజకీయ పార్టీల ప్రతినిధులతో జీహెచ్ఎంసీ కమిషనర్ సమావేశం కానున్నారు. 10న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్కిళ్ల స్థాయిలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ల సమావేశం జరగనుంది. 13న ఓటర్ల తుది జాబితా ఎస్‌ఈసీ ప్రకటించనుంది.
జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలి గడువు 10, ఫిబ్రవరి 2021తో ముగియనుంది. గడువు ముగిసేలోగానే ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్థసారధి తెలిపారు. అందుకు అన్ని చర్యలు చేపడతున్నట్లు వెల్లడించారు.