ఈ సీన్ ఎక్కడ కనిపించిందో తెలిస్తే...
ABN , First Publish Date - 2020-02-08T18:20:24+05:30 IST
మేడారం మహా జాతరలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. ఈ నెల 2వ తేదీ నుంచి...

- ఏరులై పారిన మద్యం
- ఐదు రోజుల్లో రూ. 4.58 కోట్ల వ్యాపారం
- గతేడాది కన్నా రూ.కోటి అధికం
- బీర్లకు పెరిగిన గిరాకీ
మేడారం: మేడారం మహా జాతరలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. ఈ నెల 2వ తేదీ నుంచి శుక్రవారం నాటికి రూ. 4.58 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది రూ. 3.63 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా... ఈ సంవత్సరం జాతరలో ఐదు రోజుల్లో కోటి రూపాయల మద్యం అధికంగా అమ్మారు. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో చల్లని బీరును తాగడానికి ప్రజలు ఆసక్తి కనబరచారు. ఐఎంఎల్ 3,825 పెట్టెలు, 11,037 పెట్టెల బీరు విక్రయించారు.. గత సంవత్సరం కంటే 15 వందల బీరు పెట్టెలు అధికంగా అమ్ముడయ్యాయని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.
1300 లీటర్ల గుడుంబా పట్టివేత..
జాతర ప్రారంభం కాకముందే గుడుంబా తయారీదారులు జాతర ప్రాంతం భూమిలో దాచిఉంచిన సుమారు వెయ్యి లీటర్ల గుడుంబాను ధ్వసం చేసినట్లు ఎక్సైజ్‌శాఖ ఎన్‌ఫోర్సు మెంట్ అధికారి సైదులు తెలిపారు. గురువా రం మేడారంలో గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్న వ్యక్తులను పట్టుకుని 300 లీటర్ల గుడుంబాను సాధీనం చేసుకున్నారు.