2 రోజులు తేలికపాటి వర్షాలు
ABN , First Publish Date - 2020-04-05T07:27:13+05:30 IST
రాష్ట్రంలో ఆదివారం అక్కడక్కడ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం...

హైదరాబాద్, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆదివారం అక్కడక్కడ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మరోవైపు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.