రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు
ABN , First Publish Date - 2020-04-21T09:08:14+05:30 IST
తెలంగాణలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ..

హైదరాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అఽధకారులు ప్రకటించారు. ఉత్తర కోస్తా, కర్ణాటక నుంచి మరాఠ్వాడా వరకు, ఉత్తర కర్ణాటక, మధ్య మహారాష్ట్ర మీదుగా 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది. సోమవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయని వాతావరణ కేంద్రం తెలిపింది.