రెండు రోజులు తేలికపాటి వర్షాలు

ABN , First Publish Date - 2020-06-21T08:59:35+05:30 IST

రాష్ట్రంలో రాగల 2 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

రెండు రోజులు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌, జూన్‌20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాగల 2 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివా రం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది. ఉత్తర ఒడిసా, దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కి.మీ. నుంచి 5.8 కి.మీ. ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2020-06-21T08:59:35+05:30 IST