2 రోజులు తేలికపాటి వర్షాలు

ABN , First Publish Date - 2020-04-12T08:40:47+05:30 IST

తెలంగాణలో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి

2 రోజులు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిశాయి. కాగా, కోస్తా కర్ణాటక తీర ప్రాంతానికి దగ్గరలో ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతం నుంచి ఆగ్నేయ రాజస్థాన్‌ వరకు.. ఉత్తర కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్‌ మీదుగా 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

Updated Date - 2020-04-12T08:40:47+05:30 IST