సాంఘిక బహిష్కరణ నుంచి విముక్తి

ABN , First Publish Date - 2020-12-29T06:03:57+05:30 IST

జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం సంగెం శ్రీరాంపూర్‌లో సాంఘిక బహిష్కరణకు గురైన 24 దళిత కుటుంబాలకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ‘24 దళిత కుటుంబాల సాంఘిక బహిష్కరణ’ అన్న శీర్షికన ఈనెల 28న

సాంఘిక బహిష్కరణ నుంచి విముక్తి

జగిత్యాల, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం సంగెం శ్రీరాంపూర్‌లో సాంఘిక బహిష్కరణకు గురైన 24 దళిత కుటుంబాలకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ‘24 దళిత కుటుంబాల సాంఘిక బహిష్కరణ’ అన్న శీర్షికన ఈనెల 28న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి మెట్‌పల్లి డివిజన్‌ అధికారులు సోమవారం స్పందించారు. మెట్‌పల్లి ఆర్డీఓ వినోద్‌కుమార్‌, డీఎస్పీ గౌస్‌ బాబాల ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సంగెం గ్రామానికి తరలి వెళ్లారు. అనంతరం గ్రామంలో వీడీసీ సభ్యులు, గ్రామ పెద్దలు, కుల సంఘాల పెద్దలతో భేటీ అయ్యారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో రెండు నెలలుగా సాంఘిక బహిష్కరణకు గురైన కుటుంబాలకు విముక్తి లభించింది.  తమకు ‘ఆంధ్రజ్యోతి’ విముక్తి కల్పించిందని బాధిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-12-29T06:03:57+05:30 IST