‘గాంధీ’లో సేవలందిస్తా.. అనుమతివ్వండి

ABN , First Publish Date - 2020-06-06T09:27:46+05:30 IST

గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులకు సేవలందించే అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సీఎం కేసీఆర్‌ను కోరారు.

‘గాంధీ’లో సేవలందిస్తా.. అనుమతివ్వండి

సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ


హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులకు సేవలందించే అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు ఆస్పత్రిలో సేవ చేస్తానని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కాగా, గాంధీ ఆస్పత్రిలో వైద్యులు రోగులను పట్టించుకోవడం లేదని వారి బంధువులు తనకు ఫిర్యాదు చేసినట్లు లేఖలో రాజాసింగ్‌ వివరించారు.


Updated Date - 2020-06-06T09:27:46+05:30 IST