టీఆర్‌ఎస్‌ మద్దతుదారులను గెలిపించుకుందాం

ABN , First Publish Date - 2020-02-08T11:21:35+05:30 IST

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతు దారులు గెలిచే లా నేతలు

టీఆర్‌ఎస్‌ మద్దతుదారులను గెలిపించుకుందాం

నేతల భేటీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు


హన్మకొండ టౌన్‌, ఫిబ్రవరి 7: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతు దారులు గెలిచే లా నేతలు పక్కా వ్యూహరచనతో వ్యవహ రించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. శుక్రవారం హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి ఉమ్మడి వరంగల్‌ జి ల్లా నేతలతో భేటీ అయ్యారు. ఈ సం దర్భం గా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మా ట్లాడుతూ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అన్ని సంఘాల డైరెక్టర్‌ పదవులను టీఆ ర్‌ఎస్‌ మ ద్దతు దారులను గెలిపించుకుం దామన్నారు. దీనికి స్థానిక నేతలు పక్కా ప్రణాళికతో వ్యవహరించాలన్నారు.


అన్ని సంఘాల చైర్మ న్‌లను టీఆర్‌ఎస్‌ మద్దతు దారులను గెలిపించుకునేలా నేతలు శ్రమించాలన్నారు. సహకార ఎన్నికల్లో బరిలో నిలిచిన టీఆర్‌ఎస్‌ మద్దతు దారు లకు రైతులు మ ద్దతు తెలుపాలన్నారు. సహ కార ఎన్నికల అనంతరం డీసీసీబీ చైర్మన్‌ పదవి విషయం లోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భేటీలో నిర్ణయించారు.  మేడారం జాతర విజయవంతానికి సహక రించిన అధికార యంత్రాంగానికి మంత్రి అభినందనలు తెలి పారు. ఈ భేటీలో మాజీ ఉప ముఖ్య మంత్రులు కడియం శ్రీహరి, డా.రాజయ్య. ఎంపీలు బండ ప్రకాశ్‌, పసు నూరి దయా కర్‌, శాసనమండలి విప్‌ బి.వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, గండ్ర వెంక టరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, జడ్పీ చైర్మ న్‌ సుధీర్‌కుమార్‌, నేతలు కె.వాసుదే వరెడ్డి, సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-08T11:21:35+05:30 IST