క్రీడారంగాన్ని అగ్రభాగాన నిలుపుతాం

ABN , First Publish Date - 2020-11-03T08:19:50+05:30 IST

క్రీడాశాఖను అగ్రభాగాన నిలిపే లక్ష్యంతో క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం నాగిరెడ్డిగూడ

క్రీడారంగాన్ని అగ్రభాగాన నిలుపుతాం

 గుత్తా జ్వాల అకాడమీ ప్రారంభోత్సవంలో కేటీఆర్‌

మొయినాబాద్‌ రూరల్‌, నవంబరు 2: క్రీడాశాఖను అగ్రభాగాన నిలిపే లక్ష్యంతో క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం నాగిరెడ్డిగూడ పరిధిలో ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఏర్పాటు చేసిన ‘అకాడమీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ను ఆయన ప్రారంభించారు. క్రీడాభివృద్ధికి రాష్ట్ర వ్యాప్తంగా 110 మైదానాలను ఏర్పాటు చేశామని కేటీఆర్‌ చెప్పారు. వాటిలో ఇప్పటికే 50వరకూ పూర్తయ్యాయని తెలిపారు.


మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ.. క్రీడాకారుల సంక్షేమం, క్రీడారంగ అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా.. జ్వాలతో మంత్రులు కాసేపు బ్యాడ్మింటన్‌ ఆడారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్‌ తదితరులు ప్రారంభించారు.


Updated Date - 2020-11-03T08:19:50+05:30 IST