మనమంతా ఒక్కటిగా ఉందాం!
ABN , First Publish Date - 2020-12-03T07:48:56+05:30 IST
కష్టకాలంలో పార్టీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలమంతా ఒక్కటిగా ఉందామని, కలిసి కట్టుగా పని చేసి పార్టీని తిరిగి బలోపేతం చేసుకుందామని కాంగ్రె్‌సకు చెందిన ఎస్సీ,

పార్టీకి దూరమైన వర్గాలను దగ్గర చేసుకుందాం
కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతల భేటీ నిర్ణయం
హైదరాబాద్, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): కష్టకాలంలో పార్టీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలమంతా ఒక్కటిగా ఉందామని, కలిసి కట్టుగా పని చేసి పార్టీని తిరిగి బలోపేతం చేసుకుందామని కాంగ్రె్‌సకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతల సమావేశం నిర్ణయించింది. పార్టీలోని ఏ వర్గానికి ఆ వర్గం సమావేశాలు నిర్వహించుకునే సంప్రదాయానికి భిన్నంగా బుధవారం కాంగ్రె్‌సకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు సమావేశమయ్యారు.
ఇందులో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్‌లు వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్, మాజీ మంత్రులు గీతారెడ్డి, కె.చంద్రశేఖర్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, బీసీ సెల్ అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా బీసీ, ఎస్సీ, ఎస్టీలు పార్టీకి దూరమయ్యారని, ఆ వర్గాలను మళ్లీ పార్టీకి దగ్గర చేసుకునే మార్గాలు అన్వేషించాలనుకున్నారు.
బీజేపీ, ఎంఐఎంలు మతం ఆధారంగానే రాజకీయాలు చేస్తున్నాయని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం కులాల వారీ పథకాలకు ప్రాధాన్యతలు ఇస్తోందన్న అభిప్రాయాలు వచ్చాయి. రిజర్వేషన్ల నిర్ణయం నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీల సాధికారతకు కాంగ్రెస్ పార్టీనే కృషి చేసిందని అభిప్రాయపడ్డారు. పార్టీ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత, సోషల్ ఇంజినీరింగ్ తదితరాలపై అధిష్ఠానానికి నివేదించాలనుకున్నారు.