ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెడతాం : ట్రెసా

ABN , First Publish Date - 2020-09-12T09:10:15+05:30 IST

రెవెన్యూ శాఖ సేవలను కొనియాడుతూ శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రసంగంపై తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (

ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెడతాం : ట్రెసా

రెవెన్యూ శాఖ సేవలను కొనియాడుతూ శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రసంగంపై  తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) హర్షం వ్యక్తం చేసింది. సీఎం ప్రసంగం ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం పెంచిందని ట్రెసా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వంగ రవీందర్‌ రెడ్డి, గౌతమ్‌ కుమార్‌ తెలిపారు.


రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని, రైతులు, ప్రజల సంక్షేమం కోసం మరింత ఉత్సాహంతో పనిచేస్తామని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  కొత్త రెవెన్యూ చట్టం పారదర్శకమైనదని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్‌ దేవీ ప్రసాద్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందరికీ పాస్‌బుక్‌లు అందించాలని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదన్నారు.


Updated Date - 2020-09-12T09:10:15+05:30 IST