ఆదివాసీల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకోం
ABN , First Publish Date - 2020-11-03T07:12:11+05:30 IST
ఆదివాసీల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకోబోమని కుమ్రం భీం మనువడు కుమ్రం సోనేరావు హెచ్చరించారు.
కుమ్రం భీం మనువడు కుమ్రం సోనేరావు
నార్నూర్, నవంబరు 2 : ఆదివాసీల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకోబోమని కుమ్రం భీం మనువడు కుమ్రం సోనేరావు హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌లోని భీం విగ్రహానికి సోమవారం ఆయన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సోనేరావు మాట్లాడుతూ.. రాజమౌళి రూపొందిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో భీం పాత్ర పోషిస్తున్న హీరో ఇతర మతాలకు చెందిన టోపీని ధరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాజమౌళి వెంటనే ఆ సన్నివేశాలను తీసివేయాలని, లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.