ఎవరినీ ఆకలితో ఉండనివ్వం

ABN , First Publish Date - 2020-03-30T10:03:49+05:30 IST

రాష్ట్రంలో కరోనా రోగులకు సంబంధించి మంత్రి కేటీఆర్‌ ఓ శుభవార్త తెలిపారు. ఇటీవల కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలిన 11 మందికి, ఆదివారం నిర్వహించిన తాజా

ఎవరినీ ఆకలితో ఉండనివ్వం

ట్విటర్‌లో కేటీఆర్‌.. 

రోజుకు లక్ష మందికి భోజనం..

‘అక్షయపాత్ర’ను కోరిన మంత్రి

హైదరాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా రోగులకు సంబంధించి మంత్రి కేటీఆర్‌ ఓ శుభవార్త తెలిపారు. ఇటీవల కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలిన 11 మందికి, ఆదివారం నిర్వహించిన తాజా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినట్లు వెల్లడించారు. ఇది కొంతవరకు శుభవార్త అని ట్విటర్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరినీ పస్తులుంచబోమని, ఈ విషయం లో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పనిచేస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న అన్నపూర్ణ కేంద్రాల ద్వారా 150 చోట్ల మధ్యాహ్నం, రాత్రి భోజనం ఉచితంగా అందిస్తున్నామని తెలిపా రు. శనివారం దాదాపు 40 వేల మందికి భోజనం అందించామని వెల్లడించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరిస్తున్న అక్షయపాత్ర సంస్థకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. రోజుకు కనీసం లక్ష మందికి భోజనం అందించేలా చూడాలని కోరారు. పారిశుధ్య కార్మికుల కోసం రూ.5లక్షలు విరాళం ఇచ్చిన నిరంజన్‌రావును అభినందించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 145 మొబైల్‌ రైతుబజార్లను ప్రారంభించామని తెలిపారు. చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆపకుండా చర్యలు తీసుకోవాలని ఒక నెటిజన్‌  కేటీఆర్‌ను కోరారు.


స్పందించిన మంత్రి.. ఈ విషయ మై చర్యలు తీసుకోవాలని మంత్రి ఈటలకు సూచించగా, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఈటల తెలిపారు. తమ కుటుంబ సభ్యులు చనిపోయారని, అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం కల్పించాలన్న పలువురు నెటిజన్ల విజ్ఞప్తికి కేటీఆర్‌ సా నుకూలంగా స్పందించారు. వారికి అవసరమైన సహకారం అందించాలని తన కార్యాలయ సిబ్బందికి సూచించారు. మహబూబాబాద్‌ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న వలస కార్మికులకు అండగా నిలిచిన మంత్రి సత్యవతి రాథోడ్‌ను కేటీఆర్‌ అభినందించారు. కింగ్‌ కోఠిలో 350 బెడ్లను కరోనా రోగుల కోసం ఏర్పాటు చేశారని చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే వైరస్‌ నియంత్రణలో భారత్‌ మెరుగ్గా ఉందని, దాని నివారణకు మరింత కృషి అవసరం అని పేర్కొన్నారు.  

Updated Date - 2020-03-30T10:03:49+05:30 IST