11 రోజులుగా వెయ్యిలోపే కేసులు
ABN , First Publish Date - 2020-12-01T08:43:40+05:30 IST
విదేశాలతోపాటు, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ గడగడిలాడిస్తుంటే తెలంగాణలో మాత్రం కొత్తగా నమోదయ్యే కేసులు తగ్గుముఖం పడుతుండడం ఊరట కలిగిస్తోంది.
రాష్ట్రంలో కొత్తగా 593 పాజిటివ్‌లు.. మరో ముగ్గురు మృతి
హైదరాబాద్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): విదేశాలతోపాటు, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ గడగడిలాడిస్తుంటే తెలంగాణలో మాత్రం కొత్తగా నమోదయ్యే కేసులు తగ్గుముఖం పడుతుండడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 10 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి రోజుకు వెయ్యిలోపే కేసులు నమోదవుతున్నాయి. నవంబరు 19న 1,058 పాజిటివ్‌లు రాగా, ఆ తర్వాత నుంచి వెయ్యిలోపే కేసులు వస్తున్నాయి. నిత్యం 40వేలకు తగ్గకుండా పరీక్షలు చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఆ సంఖ్యను మరింత పెంచుతున్నారు. సాధారణంగా ఆదివారం చాలా తక్కు వ పరీక్షలు జరుగుతాయి. కానీ.. ఈ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 33,040 టెస్టులు నిర్వహించగా.. 593 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,69,816కు పెరిగింది. వైరస్ కారణంగా మరో ముగ్గురు చనిపోవడంతో మరణాల సంఖ్య 1,458కి చేరింది. అలాగే, వివిధ ఆస్పత్రుల నుంచి ఆదివారం 1058 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,022 యాక్టివ్ కేసులున్నాయి.