సిద్దిపేట సమీపంలో చిరుత సంచారం.. స్థానికుల ఆందోళన

ABN , First Publish Date - 2020-06-19T02:58:54+05:30 IST

సిద్దిపేట సమీపంలో చిరుత సంచారం.. స్థానికుల ఆందోళన

సిద్దిపేట సమీపంలో చిరుత సంచారం.. స్థానికుల ఆందోళన

సిద్దిపేట: చిరుతపులి సంచారంతో మోతే గ్రామ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మిరుదొడ్డి మండలం మోతే గ్రామ శివారులో చిరుతపులి సంచారం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. చిరుతపులి గ్రామ సమీపంలోకి వచ్చిందన్న సమాచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో గ్రామానికి చేరుకున్న అధికారులు... చిరుత అడుగులను అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. 

Updated Date - 2020-06-19T02:58:54+05:30 IST