శాసన వ్యవస్థను నవ్వులపాలు చేశారు: కేకే
ABN , First Publish Date - 2020-09-20T22:43:38+05:30 IST
శాసన వ్యవస్థను నవ్వులపాలు చేశారని ఎంపీ కేకే ధ్వజమెత్తారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి రోజు చూడలేదని తెలిపారు. డిప్యూటీ చైర్మన్‌ను ప్రభుత్వం ప్రభావితం చేసిందని

ఢిల్లీ: శాసన వ్యవస్థను నవ్వులపాలు చేశారని ఎంపీ కేకే ధ్వజమెత్తారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి రోజు చూడలేదని తెలిపారు. డిప్యూటీ చైర్మన్‌ను ప్రభుత్వం ప్రభావితం చేసిందని, వ్యవసాయ బిల్లుపై ఓటింగ్ వచ్చేసరికి ప్రభుత్వం భయపడిందని, రైతు సంఘాలతో ప్రభుత్వం చర్చలు ఎందుకు జరపలేదు? అని కేకే ప్రశ్నించారు. రాజ్యసభలో ప్రభుత్వానికి మద్దతు లేకపోయినా.. మూజువాణి ఓటు పెట్టడం ఏంటి? అని కేకే ప్రశ్నించారు.