నేతలు, మంత్రులంతా ఇళ్లకే పరిమితం

ABN , First Publish Date - 2020-03-23T10:59:04+05:30 IST

జనతా కర్ఫ్యూలో పార్టీలకు అతీతంగా రాష్ట్రంలోని నేతలందరూ భాగస్వాములయ్యారు. సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై మొదలు మంత్రులు, అన్ని పార్టీల ముఖ్య

నేతలు, మంత్రులంతా ఇళ్లకే పరిమితం

ఎక్కడి వాళ్లు అక్కడే స్వీయ నిర్భంధంలోకి


హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): జనతా కర్ఫ్యూలో పార్టీలకు అతీతంగా రాష్ట్రంలోని నేతలందరూ భాగస్వాములయ్యారు. సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై మొదలు మంత్రులు, అన్ని పార్టీల ముఖ్య నేతలు ఇందులో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌, గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌కు పరిమితమయ్యారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి, మంత్రులు  హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, వి.శ్రీనివా్‌సగౌడ్‌, సీహెచ్‌.మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, సత్యవతిరాథోడ్‌, మహమూద్‌అలీ, పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ ఇళ్లలోనే ఉన్నారు. మంత్రి ఈటల మాత్రం కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఉన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి పానగల్‌లోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి అక్కడే గడిపారు.


ప్రగతిభవన్‌కే పరిమితమైన మంత్రి కేటీఆర్‌ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ఇంట్లోనే ఉన్న మంత్రి హరీశ్‌రావు.. స్వచ్ఛ సిద్దిపేట విషయమై మునిసిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  కాంగ్రెస్‌నేతలు ఉత్తమ్‌, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క సైతం ఇళ్లలోనే ఉండిపోయారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి స్వీయ నిర్బంధం విధించుకున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సాయంత్రం ఐదు గంటలకు తన నివాసంలో గంటానాదం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీలోని తన అధికారిక నివాసానికే పరిమితమయ్యారు.

Updated Date - 2020-03-23T10:59:04+05:30 IST