న్యాయవాదులు నైపుణ్యాలు పెంచుకోవాలి
ABN , First Publish Date - 2020-11-27T08:12:49+05:30 IST
న్యాయవాదులు నైపుణ్యాల పెంపుపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని నల్సార్ రిజిస్ట్రార్ ఆచార్య బాలకిష్టారెడ్డి కోరారు.

నల్సార్ రిజిస్ట్రార్ బాలకిష్టారెడ్డి
హైదరాబాద్, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): న్యాయవాదులు నైపుణ్యాల పెంపుపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని నల్సార్ రిజిస్ట్రార్ ఆచార్య బాలకిష్టారెడ్డి కోరారు. గురువారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. న్యాయవాదుల్లో నైపుణ్యాలను పెంచేందుకు ‘సెంటర్ ఫర్ ప్రాక్టిసింగ్ లా’ ప్రారంభించిన నల్సార్ పూర్వ విద్యార్థి, న్యాయవాది సురే్‌షను నల్సార్ వర్సిటీ రిజిస్ర్టార్ బాలకిష్టారెడ్డి అభినందించారు.
న్యాయవాదులకు ట్రయల్ కోర్టు ప్రాక్టీసులతో పాటు హైకోర్టుకు సంబంధించిన అనేక సమాచారం దీనిద్వారా పొందవచ్చని ఆయన కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానంతో యువ న్యాయవాదులు నైపుణ్యాలను మరింత పెంచుకోవచ్చన్నారు.