గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-05-12T01:21:49+05:30 IST

గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ క్లినికల్‌ ట్రయల్స్‌ను వైద్యులు ప్రారంభించారు. ఐసీఎమ్మార్ పర్యవేక్షణలో ప్లాస్మా థెరపీ ట్రయల్స్‌ చేయనున్నారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి ప్లాస్మాను వైద్యులు సేకరించారు.

గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభం

హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ క్లినికల్‌ ట్రయల్స్‌ను వైద్యులు ప్రారంభించారు. ఐసీఎమ్మార్ పర్యవేక్షణలో ప్లాస్మా థెరపీ ట్రయల్స్‌ చేయనున్నారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి ప్లాస్మాను వైద్యులు సేకరించారు. కరోనా బారిన పడినవారికి ప్లాస్మా చికిత్స చేసేందుకు గాంధీ ఆస్పత్రిలో అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. రాష్ట్రంలో ప్లాస్మా థెరపీకి సంబంధించి.. గాంధీతో పాటు ఈఎస్‌ఐ ఆస్పత్రికి కూడా ఐసీఎమ్మార్ అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్లాస్మాథెరపీ అందించేందుకు గాంధీ వైద్య విభాగాలు సిద్ధమయ్యాయి. గతంలో కరోనా బారిన పడి కోలుకున్న 15 మంది ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. వారే కాకుండా మరో 200 మంది తమ ప్లాస్మా ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు.

Updated Date - 2020-05-12T01:21:49+05:30 IST