ఎండలో కూర్చోపెట్టి ఎగ్జాం రాయిస్తున్న పోలీసులు
ABN , First Publish Date - 2020-04-26T22:21:12+05:30 IST
జిల్లా కేంద్రంలో పోలీసులు వినూత్న రీతిలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

వనపర్తి: జిల్లా కేంద్రంలో పోలీసులు వినూత్న రీతిలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్నవారిని ఎండలో కూర్చొబెట్టి ఒక గంట సమయం ఇచ్చి కరోనా ఏ దేశంలో ఎంత శాతం ఉంది? ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎంత శాతం? మరణాలు ఎన్ని జరిగాయంటూ ప్రశ్నపత్రం తయారు చేసి వారికి ఇచ్చి పరీక్ష రాయిస్తూ.. కరోనాపై అవగాహన కల్పిస్తూ.. రోజుకో విధంగా శిక్ష వేస్తున్నారు. అయినా ప్రజలు చిన్న చిన్న కారణాలతో రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ప్రజలు సయంమనం పాటించాలని, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించవద్దని పోలీసులు కోరుతున్నారు.