ఓఆర్ఆర్ దగ్గర ప్రమాదం.. లారీ బోల్తా, ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-05-30T13:25:52+05:30 IST

శామీర్‌పేట పీఎస్‌ పరిధిలో రోడ్డుప్రమాదం జరిగింది. ఓఆర్‌ఆర్‌ బ్రిడ్జి వద్ద వంతెన పైనుంచి సిమెంట్‌ లారీ కిందపడిపోయింది

ఓఆర్ఆర్ దగ్గర ప్రమాదం.. లారీ బోల్తా, ఒకరి మృతి

మేడ్చల్‌: శామీర్‌పేట పీఎస్‌ పరిధిలో రోడ్డుప్రమాదం జరిగింది. ఓఆర్‌ఆర్‌ బ్రిడ్జి వద్ద వంతెన పైనుంచి సిమెంట్‌ లారీ కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ భాస్కర్ నాయక్ మృతిచెందాడు. మృతుడు దేవరకొండ ప్రాంతానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. లారీ కింద మరిన్ని మృతదేహాలు ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు జేసీబీ సాయంతో సిమెంట్ బస్తాలను తొలగిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-05-30T13:25:52+05:30 IST