లారీ బోల్తా.. డ్రైవర్ మృతి
ABN , First Publish Date - 2020-06-01T08:41:58+05:30 IST
బీరు బాటిళ్ల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
- బీరు బాటిళ్లను ఎత్తుకెళ్లిన వాహనదారులు
- కేతేపల్లిలో రోడ్డు ప్రమాదం
- మంది వలస కూలీలకు గాయాలు
కీసర/కేతేపల్లి, మే 31: బీరు బాటిళ్ల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ మాజిద్(34) భోగారం లిక్కర్ గోదాంలో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి బీరు బాటిళ్ల లోడుతో సంగారెడ్డి నుంచి భోగారం వెళ్తుండగా కీసర మండలం తిమ్మాయిపల్లి గ్రామ సరిహద్దులోకి రాగానే లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో మాజిద్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, రోడ్డుకు ఇరువైపులా పడిన బీరు బాటిళ్లను వాహనదారులు ఎత్తుకుపోయారు.
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది వలస కూలీలు గాయపడ్డారు. ఏపీలోని ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన 20 మంది కూలీలు హైదరాబాద్‌లో పనులు చేసుకుంటున్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత వీరంతా వ్యాన్‌లో స్వస్థలానికి బయలుదేరారు. వీరి వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన మినీ లారీ ఢీకొట్టింది. దీంతో వ్యాన్ 10 మీటర్లు దూసుకెళ్లి రోడ్డు పక్కన బోల్తా కొట్టింది.