పెద్దవాగు పరిసరాల్లో పెద్దపులి సంచారం

ABN , First Publish Date - 2020-11-27T07:54:29+05:30 IST

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికలపేట మండలం అగర్‌గూడ గ్రామ సమీపంలోని పెద్దవాగు ప్రాంతంలో గురువారం పెద్దపులి కనిపించడంతో

పెద్దవాగు పరిసరాల్లో పెద్దపులి సంచారం

పెంచికలపేట: కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికలపేట మండలం అగర్‌గూడ గ్రామ సమీపంలోని పెద్దవాగు ప్రాంతంలో గురువారం పెద్దపులి కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు యువకులకు పెద్ద వాగు ప్రాంతంలో పెద్ద పులి నీరు తాగుతూ కనిపించడంతో వారు సెల్‌ఫోన్లతో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.


ఇటీవల దహెగాం మండలం దిగిడ గ్రామంలో విగ్నేశ్‌ అనే యువకుడిపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. తాజాగా పెంచికలపేట మండలంలో పులి కనిపించడంతో గిరిజన గ్రామాలైన మురలిగూడ, జిల్లెడ, కమ్మర్‌గాం, గుండెపల్లి, అగర్‌గూడ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ విషయమై ఎఫ్‌ఆర్‌వో వేణుగోపాల్‌ను వివరణ కోరగా అగర్‌గూడ పెద్దవాగు ప్రాంతంలో పులి సంచారం నిజమేనని చెప్పారు.  


Read more