మోదీ సంకల్పం కోసం పురాణపండ శ్రీనివాస్ దైవీయ గ్రంథం
ABN , First Publish Date - 2020-04-08T23:17:52+05:30 IST
కరోనా నిరోధానికి తాపత్రయపడుతున్న ప్రధాని మోదీకి మద్దతుగా... కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి సమర్పణలో..

కరోనా నిరోధానికి తాపత్రయపడుతున్న ప్రధాని మోదీకి మద్దతుగా... కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి సమర్పణలో దైవీయ గ్రంథాన్ని ప్రచురించి లక్షల ప్రతులను ఉచితంగా పంచబోతున్నారు. ‘‘శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రమ్’ ప్రచురణ మహత్కార్యాన్ని ప్రముఖ రచయిత, జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం సంస్థాపకులు పురాణపండ శ్రీనివాస్‌కి అప్పగించారు. మనోహర మంగళ దృశ్యాలతో, అందమైన వ్యాఖ్యాన వైఖరితో ఈ గ్రంథాన్ని పురాణపండ శ్రీనివాస్ తీర్చిదిద్దుతున్నారు. శంకర జయంతి సందర్భంగా ఈ నెల 28న విడుదల చేస్తున్న ఈ గ్రంథాన్ని బీజేపీ కార్యకర్తల ద్వారా పంపిణీ చేయనున్నారు.