సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయాలని సీఎంను కోరాలనుంది: లక్ష్మారెడ్డి

ABN , First Publish Date - 2020-12-15T18:28:08+05:30 IST

మహబూబ్‌నగర్: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయాలని సీఎంను కోరాలనుంది: లక్ష్మారెడ్డి

మహబూబ్‌నగర్: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్‌నగర్‌లో ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటు ఉందన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని సీఎంను కోరాలని ఉందన్నారు. 24 గంటల కరెంట్ కాకుండా.. కేవలం 3 గంటల కరెంట్ ఇవ్వాలని కోరుతానని లక్ష్మారెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రస్తుతం నిలిపివేసి.. ఎన్నికలకు ఏడాది ముందు మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-15T18:28:08+05:30 IST