కేసీఆర్‌కు వ్యవసాయ బిల్లుపై మాట్లాడే అర్హత లేదు: లక్ష్మణ్

ABN , First Publish Date - 2020-09-21T18:48:38+05:30 IST

హైదరాబాద్: తడి బట్టతో రైతుల గొంతు కోసే కేసీఆర్‌కు వ్యవసాయ బిల్లుపై మాట్లాడే అర్హత లేదని బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు.

కేసీఆర్‌కు వ్యవసాయ బిల్లుపై మాట్లాడే అర్హత లేదు: లక్ష్మణ్

హైదరాబాద్: తడి బట్టతో రైతుల గొంతు కోసే కేసీఆర్‌కు వ్యవసాయ బిల్లుపై మాట్లాడే అర్హత లేదని బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. రైతులను దోచుకోవటానికున్న రాజమార్గం మూసుకుపోతోందని టీఆర్ఎస్ బాధ పడుతోందన్నారు. వ్యవసాయ చట్టంతో రైతుల ఆదాయం రెట్టింపవుతుందన్నారు. రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్‌పై ప్రతిపక్ష ఎంపీల దాడిని ఖండిస్తున్నామని లక్ష్మణ్ తెలిపారు. కోవిడ్ నిబంధనలను పాటించాల్సిన ఎంపీలు తీరు బాధాకరమన్నారు. కొత్త వ్యవసాయ చట్టంతో యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపుతారన్నారు. దేశ భవిష్యత్‌కు వ్యవసాయ చట్టం పునాది వంటిదన్నారు. రైతు తనకు నచ్చిన ధరకు పంటను అమ్ముకునే అవకాశం లభించిందని లక్ష్మణ్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-21T18:48:38+05:30 IST