లేబర్‌ అధికారి హత్య కేసులో ముగ్గురి అరెస్టు

ABN , First Publish Date - 2020-03-12T09:52:37+05:30 IST

ఖమ్మం జిల్లాలో అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ మోకు ఆనంద్‌రెడ్డి(44) హత్య కేసులో వరంగల్‌ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు పింగిలి

లేబర్‌ అధికారి హత్య కేసులో ముగ్గురి అరెస్టు

వరంగల్‌ అర్బన్‌ క్రైం, మార్చి 11: ఖమ్మం జిల్లాలో అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ మోకు ఆనంద్‌రెడ్డి(44) హత్య కేసులో వరంగల్‌ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు పింగిలి ప్రదీ్‌పరెడ్డితో పాటు అతడి డ్రైవర్‌ నిగ్గుర రమేశ్‌, విక్రమ్‌రెడ్డిలను పట్టుకునేందుకు మూడు పోలీసు బృందాలు గాలిస్తున్నట్టు వరంగల్‌ అడిషనల్‌ డీసీపీ మల్లారెడ్డి చెప్పారు. అరెస్టు చేసిన నిందితులు వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలానికి చెందిన వెంగళ శివరామకృష్ణ, మీనుగు మధుకర్‌, నిగ్గుల శంకర్‌గా పేర్కొన్నారు. ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు తెలిపారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో హతుడు ఆనంద్‌రెడ్డి మృతదేహాన్ని రాంపూర్‌ అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుక్నుట్లు తెలిపారు.

Updated Date - 2020-03-12T09:52:37+05:30 IST