టీటీడీపీ అధ్యక్షుడిగా ఎల్. రమణ
ABN , First Publish Date - 2020-10-19T18:33:59+05:30 IST
తెలుగుదేశం పార్టీ కమిటీలను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సోమవారం ప్రకటించారు. తెలంగాణ టీడీపీ

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కమిటీలను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సోమవారం ప్రకటించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ప్రస్తుత అధ్యక్షుడు ఎల్. రమణను కొనసాగిస్తూ చంద్రబాబు తుది నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే రమణను తొలగించి, మరొకరిని అవకాశం ఇవ్వాలంటూ పలువురు టీడీపీ నేతలు బహిరంగంగానే చంద్రబాబును డిమాండ్ చేశారు. దీంతో టీటీడీపీలో కాస్త అలజడి రేగింది. కానీ... ఎల్. రమణ బలమైన బీసీ నేత కావడం.... తెలంగాణలో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పగ్గాలను మోయడానికి ధైర్యం చేసి... రమణ ముందుకు వచ్చిన నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు... ఆయనవైపే మొగ్గు చూపారు. ఇక... ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసినిని అధిష్ఠానం ప్రకటించింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తెలుగుదేశం నుంచి కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.
జాతీయ ప్రధాన కార్యదర్శి : కొత్తకోట దయాకర్ రెడ్డి,
జాతీయ ఉపాధ్యక్షులు : మెచ్చా నాగేశ్వర రావు (ఎమ్మెల్యే, అశ్వారావు పేట)
ఇక పార్టీ అత్యున్నత మండలి అయిన పొలిట్ బ్యూరోలో తెలంగాణ నుంచి సీనియర్ నేతలైన రావుల చంద్రశేఖర రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, ఎల్. రమణకు అవకాశం కల్పించారు.
జాతీయ అధికార ప్రతినిధులు : తిరునగరి శరత్ జోత్స్న, నన్నూరి నర్సిరెడ్డి,