8 నుంచి కేయూ పీజీ సెమిస్టర్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-10-03T09:55:50+05:30 IST

8 నుంచి కేయూ పీజీ సెమిస్టర్‌ పరీక్షలు

8 నుంచి కేయూ పీజీ సెమిస్టర్‌ పరీక్షలు

కేయూ క్యాంపస్‌, అక్టోబరు 2: కాకతీయ యూనివర్సిటీ పీజీ ఆఖరు సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి విద్యార్థులకు అక్కడే పరీక్షలు రాసేందుకు వర్సిటీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా పరీక్షలు జరిగే యూనివర్సిటీలు, పట్టణాల వివరాలను కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ ఎస్‌.మహేందర్‌రెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఎం.సురేఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పరీక్ష కేంద్రాల కేటాయింపు కోసం విద్యార్థులు తాము చదువుతున్న కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆన్‌లైన్‌/వాట్సా్‌పలో ఆధార్‌కార్డును జత చేస్తూ దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. దీంతో సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ వారికి అనుకూలమైన కేంద్రాలను కేటాయిస్తారని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం ఠీఠీఠీ.జ్చుజ్చ్టుజీడ్చ.్చఛి.జీుఽ వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చని సూచించారు. 

Updated Date - 2020-10-03T09:55:50+05:30 IST