రేపటి నుంచి యథావిధిగా కేయూ పరీక్షలు

ABN , First Publish Date - 2020-10-27T11:27:25+05:30 IST

రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన కేయూ డిగ్రీ, ఎంబీఏ, దూరవిద్య బీఈడీ పరీక్షలన్నీ ఈనెల 28 నుంచి యథావిధిగా జరుగతాయని కేయూ పరీక్షల

రేపటి నుంచి యథావిధిగా కేయూ పరీక్షలు

కేయూ క్యాంపస్‌, అక్టోబరు 26: రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన కేయూ డిగ్రీ, ఎంబీఏ, దూరవిద్య బీఈడీ పరీక్షలన్నీ ఈనెల 28 నుంచి యథావిధిగా జరుగతాయని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ ఎస్‌.మహేందర్‌రెడ్డి, డాక్టర్‌ వై.వెంకయ్య, డాక్టర్‌ సురేఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28న ఎంబీఏ పేపర్‌-5, ఈనెల 29న ఎంబీఏ పేపర్‌-6 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. అలాగే ఈనెల 28న బీఏ ఇండస్ట్రియల్‌ సోషియాలజీ, ఈనెల 29న ఇండస్ట్రియల్‌ లా పొలిటికల్‌ సోషియాలజీ, సోషల్‌సెక్యూరిటీ లెజిస్లేటివ్‌ పేపర్‌ జరుగుతాయని తెలిపారు. 

Updated Date - 2020-10-27T11:27:25+05:30 IST