కేయూ ఇంజనీరింగ్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ABN , First Publish Date - 2020-12-18T04:30:57+05:30 IST
కేయూ ఇంజనీరింగ్ పరీక్షల షెడ్యూల్ విడుదల

కేయూ క్యాంపస్, డిసెంబరు 17: కేయూ బీటెక్ ఫస్టియర్, థర్డ్ ఇయర్ మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను గురువారం కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎస్.మహేందర్‌రెడ్డి విడుదల చేశారు. ఈనెల 22, 23, 24, 28, 29, 30, 31, జనవరి 2వ తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీటెక్ ఫస్టియర్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. అలాగే బీటెక్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 22, 23, 24, 28, 29, 30వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. వివరాలకు కేయూ వెబ్‌సైట్ www.kakatiya.ac.in లో చూడాలని సూచించారు.
కేయూ తాత్కాలిక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
కేయూలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరు తూ గురువారం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు కేయూ ఉద్యోగ సంఘాల నేతలు గురువారం వినతిపత్రం ఇచ్చారు. హన్మకొండలో ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్ సమక్షంలో మంత్రి హరీశ్‌రావును కలిసి విన్నవించారు.
కేయూ రిజిస్ట్రార్‌ను కలిసిన ఉద్యోగులు
కేయూలో తాత్కాలిక ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కేయూ ఉద్యోగ సంఘాల జేఏసీ బాధ్యులు కోరారు. ఈమేరకు గురువారం కేయూలో రిజిస్ట్రార్ పురుషోత్తంను కలిసి వినతిపత్రం అందజేశారు. తమను రెగ్యులర్ చేసి, వేతనాలు పెంచాలని కోరారు.