24న సనత్‌నగర్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటన

ABN , First Publish Date - 2020-03-12T16:32:36+05:30 IST

సనత్‌నగర్‌ నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఈ నెల 24న మంత్రి కేటీఆర్‌

24న సనత్‌నగర్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటన

  • పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
  • మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

హైదరాబాద్/బేగంపేట : సనత్‌నగర్‌ నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను  ఈ నెల 24న మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారని  మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, పలు శాఖల ఉన్నతాధికారులతో బుధవారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మేయర్‌ బొంతు రామ్మోహ న్‌, వాటర్‌వర్క్స్‌ ఎండీ దానకిషోర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, కలెక్టర్‌ శ్వేత మహంతితో పాటు పలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ 24న మంత్రి కేటీఆర్‌ బల్కంపేటలోని గ్రేవ్‌ యార్డులో సుమారు రూ.90 లక్షలతో చేపట్టిన ప్రహరీ, ఆర్చి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. ఫతేనగర్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి విస్తరణ పనులను పరిశీలిస్తారన్నారు. సనత్‌నగర్‌ వెల్ఫేర్‌ గ్రౌండ్‌లో సుమారు రూ. 7కోట్ల వ్యయంతో  నిర్మించిన మల్టీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారని వివరించారు. 


మోండా మార్కెట్‌ పరిధిలోని సంతోష్‌ స్వీట్స్‌ నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌ వరకు రూ. కోటి వ్యయంతో నిర్మిస్తున్న వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను, ఆదయ్యనగర్‌ లో రూ.3 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, 3.30 కోట్లతో నిర్మించిన లైబ్రరీ భవనాన్ని కేటీఆర్‌ ప్రా రంభించనున్నట్లు వివరించారు. ఆదయ్యనగర్‌ వాటర్‌వర్క్స్‌ రిజర్వాయర్‌ పనులకు శంకుస్థాపన చేయనున్నారన్నా రు. బన్సీలాల్‌పేట కమాన్‌ నుంచి మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌ వరకు చేపట్టనున్న వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తారని చెప్పారు. జియాగూడలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభిస్తారని తెలిపారు. సమావేశంలో హెచ్‌ఆర్‌డీ ఈఈ వసంతతోపాటు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శ్రీధర్‌, నగర గ్రంథాలయ చైర్మన్‌ ప్రసన్న, కార్పొరేటర్‌లు ఉప్పల తరుణి, ఆకుల రూప, కొలను లక్ష్మితో పాటు హైదరాబాద్‌ ఆర్డీవో శ్రీనివాస్‌, డీసీలు గీతారాధిక, ముకుందరెడ్డి  పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-12T16:32:36+05:30 IST