కేటీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలి
ABN , First Publish Date - 2020-11-26T07:46:11+05:30 IST
‘‘రాష్ట్రానికి వచ్చిన ప్రతి కేంద్ర మంత్రి టీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. అయినా.. కేంద్ర ప్రభుత్వ

బీజేపీ, టీఆర్‌ఎస్ ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ
మేనిఫెస్టోనే మా హీరో: మణిక్కం ఠాగూర్
హైదరాబాద్, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రానికి వచ్చిన ప్రతి కేంద్ర మంత్రి టీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. అయినా.. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో ఎందుకు విచారణ జరిపించట్లేదు’’ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మణిక్కం ఠాగూర్ ప్రశ్నించారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే మంత్రి కేటీఆర్ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేసినా కేసీఆర్ ప్రభుత్వం కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.
గాంధీభవన్‌లో బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి ఠాగూర్ విలేకరులతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీ మతం పేరుతో ప్రజల్ని విడదీసేందుకు ప్రయత్నిస్తుంటే.. టీఆర్‌ఎస్ అవినీతి సొమ్ముతో గెలవాలనుకుంటోందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోనే తమ హీరో అన్నారు. అవినీతి సొమ్ముతో తెలంగాణలోనే ధనవంతునిగా మంత్రి కేటీఆర్ ఎదిగారన్నారు. బీజేపీ, టీఆర్‌ఎ్‌సలది ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నారు. విజయశాంతి కాంగ్రె్‌సలోనే కొనసాగుతున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా ఠాగూర్ చెప్పారు.
బండి సంజయ్‌కు హైదరాబాద్ గురించి ఏం తెలుసు?: ఉత్తమ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు చూస్తుంటే ఆయనకు రాజకీయ అవగాహన లేదని అర్థమవుతోందని ఉత్తమ్ అన్నారు. ఆయనకు హైదరాబాద్ గురించి ఏమీ తెలియదన్నారు.